'మా' ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 9కి వాయిదా | MAA elections case verdict adjourned on april-9th | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 9కి వాయిదా

Apr 7 2015 12:32 PM | Updated on Aug 9 2018 6:44 PM

మా ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

హైదరాబాద్: మా ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటులు మురళీమోహన్, అలీలు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. 'మా' ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు గత నెల 31న కోర్టుకు సమర్పించారు.

మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగిన విషయం విదితమే.  మా అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టుకు చేరింది. దాంతో అధ్యక్ష ఎన్నికలు ఫలితాలపై ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తు సిటీ కోర్టు మార్చి 31న ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement