పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి | low depression at south west of Bay of Bengal | Sakshi
Sakshi News home page

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

Dec 29 2014 11:08 PM | Updated on Sep 2 2017 6:55 PM

తమిళనాడు తీరానికి చేరువలో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది.

విశాఖ: తమిళనాడు తీరానికి చేరువలో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తాలో చాలచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల ఒ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ అల్పపీడన ప్రభావంతో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీచే అవకాశముంది. ముందు జాగ్రత్త చర్యగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement