వాళ్లు ప్రేమించుకున్నారు.. కానీ! | Lovers Suicide Attempt At In Guntur Vinukonda | Sakshi
Sakshi News home page

Jun 24 2018 9:07 AM | Updated on Aug 24 2018 2:36 PM

Lovers Suicide Attempt At In Guntur Vinukonda - Sakshi

సాక్షి, గుంటూరు : వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అందుకు తమ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. మనస్తాపానికి గురైన ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా
వినుకొండలో జరిగింది.

వినుకొండకు చెందిన షహనాజ్‌, కరీముల్లా అనే యువతీయువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వారి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన షహనాజ్‌ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ విషయం తెలియడంతో అటు కరీముల్లా కూడా పురుగుల మందు తాగాడు. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పెళ్లి కోసం పెద్దల సమక్షంలో రెండు కుటుంబాలు చేసిన చర్చలు సఫలం కాలేదని, అందుకే వీరు బలవన్మరణానికి యత్నించారని సన్నిహితులు చెప్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement