కోడెలపై లారీ ఓనర్ల ఫైర్‌..!

Lorry Owners Slams Kodela Siva Prasada Rao In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : అక్రమంగా కేసులు పెట్టి వేదిస్తున్నార్న కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలపై ఇసుక లారీ అసోషియేషన్‌ నేతలు మండిపడ్డారు. కోడెల శివరాం తమను బెదిరించి 400 లారీల ఇసుక తీసుకెళ్లారని తెలిపారు. మాటవినకపోతే పోలీసులతో బెదిరించారని అన్నారు. గుంటూరు, నరసరావుపేట, గోళ్లపాడు, సత్తెనపల్లిలోని వారి నిర్మాణాలకు ఇసుక తరలించారని చెప్పారు. డబ్బులు ఇమ్మని అడిగితే అక్రమంగా నిర్భదించి భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కోడెల కుటుంబం నుంచి తమను కాపాలని కోరుతూ లారీ ఓనర్లు ఒక లేఖ విడుదల చేశారు. ఇన్ని అక్రమాలు బయటపడుతున్నా తమ కుటుంబంపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కోడెల వ్యాఖ్యానించడం దారుణమన్నారు.

(చదవండి : ‘కోడెల ట్యాక్స్‌ పుట్ట బద్దలవుతోంది)

(చదవండి : అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top