ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ సెమీ ఫైనల్స్ | Looking forward to the semi-finals of the spell bee | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ సెమీ ఫైనల్స్

Nov 24 2014 2:42 AM | Updated on Sep 2 2017 4:59 PM

‘సాక్షి’ ఇండియా స్పెల్‌బీ జోనల్ సెమీఫైనల్స్ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

5న హైదరాబాద్‌లో ఫైనల్ పరీక్ష

నెట్‌వర్క్: ‘సాక్షి’ ఇండియా స్పెల్‌బీ జోనల్ సెమీఫైనల్స్ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడల్లో ఏకకాలంలో ఈ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ కళాశాలలో  జరిగిన ఈ పోటీలు నాలుగు కేటగిరీల్లో నిర్వహించగా వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారు. విశాఖపట్నంలో సీతంపేటలోని వి.టి హైస్కూల్‌లో ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.45 వరకు నాలుగు బ్యాచ్‌లుగా పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు చెందిన విద్యార్థులుహాజరయ్యారు.

తిరుపతిలోని తిరుచానూరు రోడ్డు శ్రీనివాసపురంలోని రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థలు వేదికగా పరీక్ష నిర్వహించారు. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిసెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే సాక్షి స్పెల్‌బీ ఫైనల్ పరీక్షకు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement