ఒబామాతో లోకేశ్ ఫొటో | lokesh photo with obama | Sakshi
Sakshi News home page

ఒబామాతో లోకేశ్ ఫొటో

May 9 2015 2:00 AM | Updated on Apr 4 2019 4:25 PM

ఒబామాతో లోకేశ్ ఫొటో - Sakshi

ఒబామాతో లోకేశ్ ఫొటో

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ ఫొటో తీసుకున్నారు. నిధుల సమీకరణ కోసం డెమాక్రటిక్ పార్టీ '2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ఫొటో దిగారు.

డెమోక్రటిక్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో ఒబామాతో కరచాలనం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్. పదివేల డాలర్లు చెల్లించినవారికి ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒమాబాతో కరచాలనంచేస్తూ ఫొటో దిగే అవకాశం ఇచ్చారు. లోకేశ్ అలాగే ఈ అవకాశాన్ని ‘కొని’తెచ్చుకున్నారు.
 
హైదరాబాద్:
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ ఫొటో తీసుకున్నారు. నిధుల సమీకరణ కోసం డెమాక్రటిక్ పార్టీ '2016 వైట్‌హౌస్ విక్టరీ ఫండ్' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఆయన ఈ ఫొటో దిగారు. నిధుల సమీకరణకు ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లోని సెంటినెల్ హోటల్‌లో గురువారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి 300 మంది టికెట్లు కొనుగోలు చేసినట్టు ఆ పార్టీకి చెందిన డెమాక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ప్రకటించింది. ఒబామా 26 నిమిషాలపాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎక్కువ మొత్తం పెట్టి టికెట్ కొనుగోలు చేసినవారు ఒక్కొక్కరితో విడిగా అమెరికా అధ్యక్షుడు కరచాలనం చేశారు.

అందులో భాగంగానే లోకేష్ కూడా ఒబామాను కలిశారు. కార్యక్రమం హాలులో ప్రవేశానికి 500 అమెరికన్ డాలర్లు, ఒబామాతో ఫోటో దిగడానికి 5 వేల డాలర్లు, ఆయనతో కరచాలనం చేసి పరిచయం చేసుకోవడానికి 10 వేల డాలర్లు రుసుముగా నిర్దేశించిన విషయం తెలిసిందే. 500 డాలర్ల టికెట్ కొనుగోలు చేసిన వారు హాలులో ప్రవేశించి ఒబామా ప్రసంగాన్ని వినడానికి మాత్రమే వీలుంటుంది. లోకేశ్ 10 వేల డాలర్లు చెల్లించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా వచ్చిన నిధులన్నీ డెమాక్రటిక్ పార్టీ ఖాతాలోకి వెళతాయి. లోకేశ్ పోర్ట్‌ల్యాండ్‌లో ఒబామాను కలుసుకున్నారని తెలుగుదేశం పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నూతన పారిశ్రామిక విధానాన్ని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు విశేషాలను ఆయన ఒబామాకు వివరించినట్టు తెలిపింది. తన నాలుగో రోజు అమెరికా పర్యటనలో పలు ఐటీ కంపెనీల ప్రముఖులతో లోకే శ్ భేటీ అయ్యారని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement