దా‘రుణ’ స్థితి | Lease farmers Trouble in ap | Sakshi
Sakshi News home page

దా‘రుణ’ స్థితి

Oct 30 2017 9:23 AM | Updated on Sep 2 2018 4:52 PM

Lease farmers Trouble  in ap - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ రైతు లాగానే అన్ని పనులూ చేస్తున్నా ఆ అన్నదాతకు వచ్చే రాయితీలు, సంక్షేమ పథకాలు పొందలేక చతికిలపడుతున్నారు. ప్రభుత్వ సాయం మాట పక్కన పెడితే కనీస గుర్తింపు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కౌలు రైతులు దాదాపుగా 2లక్షలకు పైబడి ఉన్నట్లు రైతు సంఘాలు చెబుతుంటే అధికారులు మాత్రం యాభై వేల మందే ఉన్నట్లు లెక్కలు చూ పుతున్నారు.

అయితే ఇందులో ఇప్పటివరకు లోన్‌ ఎలిజిబులిటీ (ఎల్‌ఈసీ) కార్డులు 18వేల మందికి,సర్టిఫికేట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ (సీఓసీ) కార్డులు 12,500 మందితో కలిపి మొత్తం 30,500 మం దికి కార్డులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సుమారు 1.70 లక్షల కౌలుదారులు గుర్తింపు కార్డులకు నోచుకోక రాయితీలు పొందలేకపోతున్నారు. కౌలు రైతుల చట్టం 2011 ప్రకారం ఎలాంటి కార్డులు లేకున్నా భూ యజమాని రుణంతో సంబంధం లేకుండా రు ణం ఇవ్వాలి. కానీ అలాంటి చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కేసి గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే రుణం మంజూరు చేయాలని నిబంధన పెట్టడంతో ఏ ఒక్క కౌలు రైతు రుణం తీసుకోలేకపోతున్నారు.

సరిపోని రుణం
భూ యజమానుల మాదిరిగానే కౌలు రైతులకు పంట పండించేందుకు అయ్యే ఖర్చు రూ.30వేలు ఉంటుంది. ప్రభుత్వం అలా రుణం మంజూ రు చేయకుండా ఐదుగురు నుంచి ఏడుగురు కౌ లు రైతులు కలిపి ఒక ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి గ్రూప్‌కి రూ.70వేలు చొప్పున ఇస్తున్నారు. దీని ప్రకారం ఒక్కొక్కరికీ రూ.10వేలు మాత్ర మే అందుతోంది. అది దేనికీ సరిపోవడం లేదు.

అప్పివ్వని బ్యాంకులు
కౌలు రైతులకు రుణం మంజూరు చేయాలని క లెక్టర్‌ చెప్పినా కో ఆపరేటివ్‌ బ్యాంకులు తప్పితే మరే ఇతర జాతీయ బ్యాంకులు రుణం ఇవ్వ డం లేదు. రైతులు రుణాలు చెల్లించకుంటే బ్యాంకు అధికారుల పదోన్నతులు, ఇంక్రిమెం ట్ల మీద దాని ప్రభావం పడుతుందని పూర్తిగా రుణాల ఇచ్చేందుకే ఎగనామం పెట్టేశారు. దీం తో అప్పుల కోసం బయట వ్యక్తులను ఆశ్రయిం చడంతో ఇదే అదనుగా రూ.2కి పైగా వడ్డీ వసూలు చేస్తున్నారు. ఓ పక్క కౌలు చెల్లించాలి, మరో పక్క వడ్డీ చెల్లించాలి పంట బాగా పండితే సరే లేకుంటే మరణమే శరణ్యమవుతోంది.

ప్రదక్షిణ చేయాల్సిందే
నాకు సెంటు భూమి లేదు. ఏటా రెండు మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పండిస్తాను. దాదాపుగా పదేళ్లుగా ఇలాగే చేస్తున్నాను. ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇవ్వలేదు. కార్డు కావాలని ప్రతి రోజు రెవెన్యూ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కార్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం తీసుకోలేపోయాను.  – లబ్బ జగ్గారావు, కౌలు
 రైతు, కోమర్తి గ్రామం, నరసన్నపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement