ముగిసిన న్యాయవాదుల సమావేశం.. కీలక నిర్ణయాలు | Lawyers Association Meeting Over In Guntur | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులపై దాడులను ఖండించిన లాయర్లు

Feb 29 2020 3:10 PM | Updated on Feb 29 2020 3:42 PM

Lawyers Association Meeting Over In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: దళిత ప్రజాప్రతినిధులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ న్యాయవాదుల సంఘం నిర్వహించిన సమావేశం శనివారం ముగిసింది. రాజధానిలో దళిత ప్రజాప్రతినిధుల దాడులపై.. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్న వైనంపై గుంటూరులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌లపై జరిగిన దాడులను న్యాయవాదుల సంఘం ఖండించింది. త్వరలోనే న్యాయవాదుల జేఏసీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లోని ప్రజల్లోని దళితులకు రక్షణ లేదని వారు ఆందోళ వ్యక్తం చేశారు. కాగా వారికి రక్షణ ఉండేందుకు రాజధానిలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేనప్పుడు అమరావతిలో శాసనసభను నిర్వహించటం అనవసరమన్నారు. శాసన సభను కూడా అమరావతి నుంచి మరోచోటకు తరలించాలని న్యాయవాదుల సంఘం సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement