రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ: రతన్‌రాయ్ | Lands to be collected based on Capital level, says Ratna ray | Sakshi
Sakshi News home page

రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ: రతన్‌రాయ్

May 13 2014 1:02 AM | Updated on Sep 2 2017 7:16 AM

రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ: రతన్‌రాయ్

రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ: రతన్‌రాయ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ ఉంటుందని రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ చెప్పారు.

శివరామకృష్ణన్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ రతన్‌రాయ్
 సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే రాజధాని స్థాయిని బట్టే భూముల సేకరణ ఉంటుందని రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ రతన్‌రాయ్ చెప్పారు.  సోమవారం గుంటూరు జిల్లాలో నాగార్జున యూని వర్శిటీ, అమరావతి ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిం చింది. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమైంది. జిల్లాలో మౌలిక వసతులు, నదీజలాల పరిస్థితి, అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం, రవాణా సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతల నుంచి రాజధాని ఏర్పాటుపై నివేదికలు స్వీకరిం చారు. రతన్‌రాయ్ విలేకరులతో మాట్లాడుతూ అవసరమైతే మరోసారి జిల్లాలో పర్యటిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement