కేవలం స్వలాభం కోసమే టీడీపీ ప్యాకేజీ అంటూ నాటకాలాడుతోందని వైఎస్ఆర్ సీపీ కర్నూలు జిల్లా నేతలు విమర్శించారు.
కర్నూలు: విభజన చట్టంలో పేర్కొన్నమేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా తప్ప ప్యాకేజీలకు అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. హోదా డిమాండ్ను నిర్వీర్యం చేయడానికే టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ అంశాన్నితెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు.
కేవలం స్వలాభం కోసమే టీడీపీ ప్యాకేజీ అంటూ నాటకాలాడుతోందని విమర్శించారు. కర్నూలు పట్టణంలో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, గుమ్మలూరి జయరాం, గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యే కాటసాని తదితరులు పాల్గొన్నారు.