‘వైఎస్‌ఆర్‌ను చూసి గుంట నక్క పాదయాత్ర’ | Kodali Nani Slams Chandrababu Naidu on Padayatra | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ఆర్‌ను చూసి గుంట నక్క పాదయాత్ర చేసింది’

Nov 6 2017 11:29 AM | Updated on Nov 6 2017 4:58 PM

Kodali Nani Slams Chandrababu Naidu on Padayatra - Sakshi

సాక్షి, ఇడుపులపాయ : ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రజలకు వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు. ఇడుపులపాయలోని బహిరంగ సభలో ఆయన సోమవారం మాట్లాడారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. వైఎస్‌ పేదలకు న్యాయం చేయాలని చెప్పి పాదయాత్రను చేపట్టారు.

అనేక మందిని విద్యార్థులను చదివించిన గొప్ప వ్యక్తి వైఎస్‌. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. విద్యుత్‌ బకాయిలను రద్దు చేశారు’. ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చి పేదలను ఆసుపత్రికి పంపిన మహానుభావుడని అన్నారు. ఆయన్న చూసి పాదయాత్ర చేసిన బాబు.. పగలంతా బస్సులో పడుకుని రాత్రి నడిచారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement