భీమవరంలో యువతి కిడ్నాప్‌కు యత్నం | kidnap attempt on young women in bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో యువతి కిడ్నాప్‌కు యత్నం

Jun 21 2016 9:12 AM | Updated on Aug 1 2018 2:15 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం రాత్రి ఓ యువతిపై కిడ్నాప్‌ యత్నం జరిగింది.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం రాత్రి ఓ యువతిపై కిడ్నాప్‌ యత్నం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి భీమవరంలోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఆమె స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌కు వెళ్లింది. అదే సమయంలో బస్టాండ్ కు వచ్చిన ఇద్దరు యువకులు ఐబీ పోలీసులమంటూ బెదిరించి తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించారు. ఆమె కేకలు వేయటంతో అక్కడే ఉన్న ప్రయాణికులు వారికి దేహశుద్ధి చేసి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement