టీడీపీ.. తెలుగు దళారుల పార్టీ: కేటీఆర్ | K.taraka ramarao takes on tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ.. తెలుగు దళారుల పార్టీ: కేటీఆర్

Dec 24 2013 11:48 AM | Updated on Aug 10 2018 9:40 PM

టీడీపీ.. తెలుగు దళారుల పార్టీ: కేటీఆర్ - Sakshi

టీడీపీ.. తెలుగు దళారుల పార్టీ: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రసక్తి లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కాస్తా ఇప్పుడు తెలుగు దళారుల పార్టీగా మారిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రసక్తి లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కాస్తా ఇప్పుడు తెలుగు దళారుల పార్టీగా మారిందని, రాష్ట్ర విభజన విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోని సీమాంధ్ర పార్టీలోనే ఉంటూ తెలంగాణలో నాయకులుగా కొనసాగాలనుకోవడం ఆ పార్టీ నేతలకు సరికాదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కావాలనుకుంటే వాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లచ్చని కేటీఆర్ అన్నారు.

తమకు, కాంగ్రెస్కు ఏమైనా ఉంటే తాము చూసుకుంటామని, ఈ విషయంలో టీడీపీ వాళ్లు బ్రోకరిజం చేయాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత స్పష్టంగా చెప్పినా వాళ్లు ఇంకా తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఉంటూ సీమాంధ్ర పార్టీలో ఉండాలనుకుంటే అది అవివేకమని ఇప్పటికైనా వాళ్లు పార్టీ నుంచి బయటకు రావాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement