పావని మృతిపై జేసీ విచారణ | JC inquiry on Pavani killed | Sakshi
Sakshi News home page

పావని మృతిపై జేసీ విచారణ

Oct 17 2017 11:08 AM | Updated on Oct 17 2017 11:08 AM

కడప అర్బన్‌ : చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ బాలికల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని పావని మృతిపై విచారణ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత తేవతీయ సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు తన చాంబర్‌లో విచారణ చేపట్టారు.  విచారణలో పావని తల్లిదండ్రులైన శివమ్మ, మల్లేశ్వరరెడ్డిల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పోస్ట్‌ మార్టం నిర్వహించిన డాక్టర్లు శోభారాణి, ఆనంద్‌కుమార్, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ హేమకుమార్‌లను విచారణ చేసి వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. కాగా, ఇప్పటికే నారాయణ కళాశాల వద్దకు వెళ్లి అక్కడి విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని ఈనెల 13 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement