‘మన ఎమ్మెల్యేలు దొంగలు’ | jc diwakar reddy commensts on TDP MLAs | Sakshi
Sakshi News home page

‘మన ఎమ్మెల్యేలు దొంగలు’

Apr 16 2017 10:04 AM | Updated on Aug 10 2018 7:07 PM

‘మన ఎమ్మెల్యేలు దొంగలు’ - Sakshi

‘మన ఎమ్మెల్యేలు దొంగలు’

‘‘మంత్రిగారూ! మీకు.. మీ ముఖ్యమంత్రికి అమరావతిపై ఏమాత్రం అవగాహన లేదు’’ అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కర్నూలు(టౌన్‌): ‘‘మంత్రిగారూ! మీకు.. మీ ముఖ్యమంత్రికి అమరావతిపై ఏమాత్రం అవగాహన లేదు’’ అని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలుకు వచ్చిన మంత్రి నారాయణను ఆయన స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో కలిశారు. మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మధ్యలో కలుగజేసుకున్న జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అమరావతిలో ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్లాట్లు ఇవ్వాలి. అయితే మన ఎమ్మెల్యేలు దొంగలు. ఇచ్చిన ప్లాట్లు అమ్ముకుంటారు. వాటిని అమ్ముకోకుండా టైఅప్‌ చేసి అభివృద్ధి చేయాలి’’ అని ఆయన అన్నారు. అసలు మీ శాఖలో మున్సిపల్‌ సమస్యలను ఎక్కడ పట్టించుకుంటున్నారంటూ మంత్రి నారాయణను ఆయన ప్రశ్నించారు. మంత్రి స్పందిస్తూ.. ‘సార్‌.. సార్‌.. నాలుగు నెలలు అందుబాటులో లేను. ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాను.. సమస్యలు పరిష్కరిస్తాను’ అని జవాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement