జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విందులు, వినోదాలు, ఇతరత్రాలకు దాదాపు రూ. 12 కోట్లు హాం ఫట్ అనిపించారు. 31వ తేది రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విందులు, వినోదాలు, ఇతరత్రాలకు దాదాపు రూ. 12 కోట్లు హాం ఫట్ అనిపించారు. 31వ తేది రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు.
నూతన సంవత్సర ప్రారంభ సమయంలో ఆస్వాదించే ఆనందాన్ని సంవత్సరమంతా గుర్తు తెచ్చుకోవచ్చని జనవరి 1న జల్సాగా గడిపారు. అందుకే డిసెంబరు 31, జనవరి 1లలో దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా సోమ, మంగళ వారాల్లో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. జిల్లాలోని అన్ని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో సీటు లభించడమే కష్టమైంది. ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకల్లో మద్యమే ఎక్కువ అమ్ముడైంది. జిల్లా వ్యాప్తంగా ఈ మూడురోజుల్లో రూ. 6 కోట్లకు పైగా మద్యం గుటగుటలాడించినట్లు సమాచారం. కేకులకు దాదాపు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పూలు, బొకేలు, పూలమాలల కోసం రూ. 25 లక్షలకు పైగా వెచ్చించారు. విందులు, వినోదాల కోసం రూ. 2 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది.
జోరు తగ్గింది..
సమైక్య ఉద్యమం ప్రభావంతో ఉద్యోగులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆచితూచి ఖర్చు చేశారు. యువకులు, ఉన్నత వర్గాలు మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. మొత్తంపై గతం కంటే 10 నుంచి 20 శాతం తక్కువగానే వ్యాపారం జరిగినా ధరలు పెరగడంతో వ్యాపారులు ‘సేఫ్’ అయ్యారు.
కడప నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ప్రముఖ బేకరీ సంస్థ ఏర్పాటు చేసిన కేకుల ప్రదర్శనలో రెండు రోజులకు 10 వేల కేకులకు పైగా అమ్ముడుపోగా, నగరంలోని ఇతర ప్రాంతాలు,జిల్లా అంతటా కూడా వ్యాపారం జోరుగా సాగింది. రూ.10 లక్షలకు పైగా పండ్ల వ్యాపారం జరిగింది. మొత్తంపై జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రూ. 12 కోట్లకు పైగా ఖర్చు చేశారు.