
జయహో.. తెలంగాణ..
ఎన్నాళ్లో వేచిన సమయం.. ఇన్నాళ్లకు సాకారమవుతోంది.. మంగళవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది..
జయహో.. తెలంగాణ..
ఎన్నాళ్లో వేచిన సమయం.. ఇన్నాళ్లకు సాకారమవుతోంది.. మంగళవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో సంబరం అంబరమంటింది..
సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.. జేఏసీలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆడిపాడాయి.. టపాసులు పేల్చారు.. నృత్యాలు చేశారు.. సంతోషాలు పంచుకున్నారు.. మిఠాయిలు తినిపించుకున్నారు.. తెలంగాణవాదులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.. ఆనందడోలికల్లో మునిగితేలారు.. నియోజకవర్గమంతా సంబరాల్లో తేలియాడింది.. అడుగడుగునా జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. జయహో తెలంగాణ.. అంటూ ప్రతిఒక్కరూ నినదించారు.. వీధులు, వాడవాడలు నినాదాలతో మార్మోగాయి.. తెలంగాణ తల్లి విగ్రహానికి హారాలు వేసి హారతులు పట్టారు.. డప్పువాయిద్యాలతో ఉద్వేగ భరిత నృత్యాలు చేశారు.. తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.. కార్మికులు, కర్షకులు సంబరాలు చేశారు.
- బోధన్/బోధన్ టౌన్/బోధన్ రూరల్/రెంజల్/నవీపేట/ఎడపల్లి.