జగన్ ఇంటి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా | Jagan at home TDP Under the control of Dharna | Sakshi
Sakshi News home page

జగన్ ఇంటి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా

Oct 12 2014 1:28 AM | Updated on Oct 1 2018 2:03 PM

సరస్వతి సిమెంట్స్‌కు గతంలో విక్రయించేసిన భూముల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో కొందరు రైతులు శనివారం హైదరాబాద్‌లోని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నాకు దిగారు.

అమ్మేసిన భూములు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్
బస్సుల్లో కొందరు రైతులను తీసుకొచ్చి దేశం నేతల హల్‌చల్
పోలీసులతో తెలుగు విద్యార్థి అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి వాగ్వాదం
ఎమ్మెల్యే యరపతినేని పర్యవేక్షణలో నిరసన ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: సరస్వతి సిమెంట్స్‌కు గతం లో విక్రయించేసిన భూముల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో కొందరు రైతులు శనివారం హైదరాబాద్‌లోని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు ధర్నాకు దిగారు. టీడీపీ అనుబంధ విభాగం తెలుగు విద్యార్థి రాష్ర్ట అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి సారథ్యంలో ఈ ధర్నా చేశారు. గుంటూరు జిల్లా చెన్నాయపాలెం నుంచి ఆర్టీసీ బస్సుల్లో టీడీపీ జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు, రైతులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగన్ క్యాంపు కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. జగన్ బయటకు రావాలంటూ అనుచితంగా ప్రవర్తించటంతో భద్రతా సిబ్బంది, స్థానికంగా బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి భద్రతా సిబ్బందిని తీవ్రంగా దుర్భాషలాడుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. బ్రహ్మం చౌదరి పోలీసులతో తోపులాటకు దిగారు.
 
ఎమ్మెల్యే యరపతినేని నేతృత్వం...
ఈ సందర్భంగా కొందరు రైతులతో ‘సాక్షి’ ప్రతి నిధి మాట్లాడినపుడు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. హైదరాబాద్‌కు వ చ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే అమ్మేసిన భూములు తిరిగి వస్తాయని గురజాల ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు తమకు చెప్పారని, దీంతో టీడీపీ కార్యకర్తలతో కలిసి ఐదు బస్సుల్లో హైదరాబాద్‌కు వచ్చామని తన పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని రైతు ఒకరు చెప్పారు. ‘‘చంద్రబాబును కలవటానికి హైదరాబాద్ రమ్మన్నారు తప్ప జగన్ ఇంటి వద్ద ధర్నా చేయాలని ముందు చెప్పలేదు. ధర్నా పేరిట మా పక్కనున్న టీడీపీ నేతలు జగన్‌ను లేనిపోని మాటలనటం మాకు నచ్చలేదు. భూములు తిరిగి వస్తాయన్నారని ఆశతో వచ్చాం తప్ప ఇదంతా తెలిస్తే వచ్చేవాళ్లం కాదు’’ అని సదరు రైతు వ్యాఖ్యానిం చాడు.

ఏడేళ్ల క్రితం తాము సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పొలాలు విక్రయించామని, ఇప్పటి వర కూ నిర్మాణం ప్రారంభం కానందున వాటిని తిరిగివ్వాలని బ్రహ్మం చౌదరి మీడియాతో చెప్పా రు. ఈ కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పిన బ్రహ్మం అక్కడ అంతా తానే అయి వ్యవహరించారు. జగన్‌ను పదేపదే నోటికి వచ్చినట్లు విమర్శిస్తూ అనుచితంగా ప్రవర్తించారు. అఖిలపక్షం అధ్యక్షుడంటూ పేరుకు సంపతి వెంకట్‌యాదవ్‌ను ముందు పెట్టారు. హల్‌చల్ చేసినవారిలో మాచవరం గ్రామ సర్పం చ్ భర్త నరసింహారావు (రాయుడు) సర్పంచ్ తమ్ముడు బండ్ల సత్యం, అదే గ్రామానికి చెందిన బండ్ల బ్రహ్మయ్య, కుర్రా కోటయ్య, మాచవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఎడ్లపల్లి రామారావు, టీడీపీ నేతలు కొల్లి కృష్ణ, పుసునూరి రామయ్య, నాగేంద్రమ్మ ఉన్నారు.

అనంతరం వారంతా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పిం చారు. పంట భూములను ట్రాక్టర్లతో దున్నడాన్ని అడ్డుకోబోయిన తమ మీద దాడి చేశారని. తమకు న్యాయం చేయాలని బాబును కోరారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ఇది సివిల్ వివాదమని, చట్టపరిధిలో అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement