వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే: భూమన | It is chandra babu, who got ys rajareddy killed, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే: భూమన

May 23 2017 6:45 PM | Updated on Jul 28 2018 6:51 PM

వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే: భూమన - Sakshi

వైఎస్ రాజారెడ్డిని చంపించింది బాబే: భూమన

ఆంధ్రప్రదేశ్‌లో అసలు సిసలు ఫ్యాక్షనిస్టు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసలు సిసలు ఫ్యాక్షనిస్టు చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఫ్యాక్షన్‌పై చంద్రబాబు మాటలు వింటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డిని చంపించింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. రాజారెడ్డిని చంపిన హంతకులను చంద్రబాబు తన నివాసంలో 30 రోజుల పాటు ఉంచుకున్నారని అన్నారు.

పథకం ప్రకారమే కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య జరిగిందని, ఆయన గన్ లైసెన్సును రెన్యువల్ చేయకపోవడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని భూమన అన్నారు. టెర్రరిస్టు యాక్టివిటీకి చంద్రబాబు కిరీటధారి అని మండిపడ్డారు. అవసరాల కోసం వైఎస్ఆర్ కుటుంబాన్ని చంద్రబాబు గతంలో వాడుకున్నారన్నారు. 1981లో వైఎస్ఆర్ దయతోనే అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు పదవి వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు కిరాతకాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement