
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ నూతన (ఆర్టీజీఎస్) సీఈవోగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ కమాండ్ సెంటర్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీజీఎస్ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’కు సాంకేతిక తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీజీఎస్‌ను ముందుకు తీసుకెళ్లతామని పేర్కొన్నారు.