ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లుగా మంగళవారం బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును పొడిగిస్తూ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లుగా మంగళవారం బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము కింద రూ. 200 అదనం గా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మంజూరై, సీట్లు ఖాళీగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు.