గోండు లిపి పుస్తకావిష్కరణ | Sakshi
Sakshi News home page

గోండు లిపి పుస్తకావిష్కరణ

Published Sat, Feb 22 2014 2:02 AM

గోండు లిపి పుస్తకావిష్కరణ

 దేశంలో ప్రథమంగా వెలుగులోకి...
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆదివాసి గోండు లిపి పుస్తకాలను, ప్రత్యేక ఫాంట్‌లను శుక్రవారమిక్కడి సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. దళిత్, ఆదివాసి అధ్యయనం, అనువాద విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాషా దినోత్సవంలో భాగంగా  హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి వీటిని అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వెలుగులో లేని అదివాసి, గిరిజన భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకు విశ్వవిద్యాల యాలు కృషిచేయాలని సూచిం చారు.
 
 ప్రత్యేక ఫాంట్, పుస్తకాల ప్రచురణ ద్వారా ఈ గిరిజన భాషలకు జీవం కల్పించిన వాళ్లమయ్యామన్నారు దేశంలో మొదటిసారిగా గోండు లిపిలో పుస్తకాల ఆవిష్కరణ, ఫాంట్‌లను వెలుగులోకి తెచ్చామని సీడీఏఎస్టీ డెరైక్టర్ ప్రొఫెసర్ కృష్ణ చెప్పారు. కార్యక్రమానికి హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, సీడీఏఎస్టీ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి జనార్దన్ నివాస్ తదితరులు హాజరయ్యారు. 

Advertisement
Advertisement