వేసవిలో దర్శన ఇబ్బందులుండవ్ | In summer no problems for darshanam worship people | Sakshi
Sakshi News home page

వేసవిలో దర్శన ఇబ్బందులుండవ్

May 2 2015 3:59 AM | Updated on Aug 25 2018 7:22 PM

వేసవి సెలవుల్లో అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు...

- తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు
- ఆన్‌లైన్‌లో సప్తగిరి చందా బుకింగ్‌కు ఏర్పాట్లు
- డయల్ యువర్ ఈవోలో సాంబశివరావు వెల్లడి
సాక్షి,తిరుమల:
వేసవి సెలవుల్లో అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో కలసి ఈవో పైవిధంగా బదులి చ్చారు.  ఇప్పటికే బస, దర్శనం, తల నీలాలు,  ప్రసాదాలు, వేసవిలో తాగునీరు, ఉచిత సముదాయల్లో పరిశుభ్రత వంటి అనేక అంశాల్లోనూ మార్పులు చేశామన్నారు.

అన్ని  కల్యాణకట్టల్లోనూ టికెట్లు వసూలు చేయకుండా ఉచితంగా తలనీలాలు తీస్తున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు ఉండే బ్లేడ్లను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కల్యాణకట్టలతోపాటు గదులు, దర్శనంలో డబ్బు లు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని తిరుపతి దింపేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. వృద్ధులు, వికలాంగుల దర్శనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.  వారు స్వామి దర్శనం కోసం వచ్చే దూరాన్ని తగ్గిం చేలా పరిశీలిస్తామని తెలిపారు.

ఎస్వీబీసీలో ప్రస్తుతం తెలుగులోనే ప్రసారాలున్నాయని,  త్వరలోనే తమి ళం, కన్నడ భాషల్లో కార్యక్రమాలు ప్ర సారం చేస్తామన్నారు. సప్తగిరి మాసపత్రికను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. టీటీడీ పరిధిలో భక్తులకు ఎదురైన సమస్యలను దేవస్థానం కాల్‌సెంటర్ 0877-2277777 ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పరి ష్కరిస్తున్నట్లు ఈవో సాంబశివరావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement