చంద్రబాబు సభలో గందరగోళం | IKP employees protest at chandra babu meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సభలో గందరగోళం

Nov 1 2014 4:02 PM | Updated on Jul 28 2018 6:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా కలవపూడిలో పాల్గొన సభ గందరగోళంగా మారింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా కలవపూడిలో పాల్గొన సభ గందరగోళంగా మారింది. తమకు జీతాలు చెల్లించాలని ఐకేపీ యానిమేటర్లు సభలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకు దిగిన యానిమేటర్లపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు అంతకుముందు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. తీర ప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. పంచాయతీల అభివృద్ధి కోసం 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement