అది క్షుద్ర పూజ కాదు.. చండీ హోమం మాత్రమే!

Iam Not Involed with any Kshudra Pooja, Ganti Radha Krishna - Sakshi

శ్రీశైలం: తాను శ్రీశైలం దేవస్థానం పరిధిలో క్షుద్ర, తాంత్రిక పూజలు చేశానని ఒప్పకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను వేద పండితుడు గంటి రాధాకృష్ణ శర్మ ఖండించారు.  తన చేత బ్రాహణ సంఘం నేతలు బలవంతంగా వివరణ లేఖపై సంతకం పెట్టించారని  రాధాకృష్ణ ఆరోపించారు. తన నివాసంలో చేసింది కేవలం చండీ హోమం మాత్రమేనని స్పష్టం చేశారు. క్షుద్ర పూజలు చేశానంటూ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడానికే మీడియా ముందుకొచ్చానని రాధాకృష్ణ తెలిపారు. 

శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆలయం వేద పండితుడు రాధాకృష్ణ శర్మ తన ఇంటి వద్ద తాంత్రిక పూజలు చేశారన్న వ్యవహారం ఇటీవల వెలుగుచూసింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. దీంతో ఆయన హైకోర్టు, హెచ్చార్సీని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా విచారణ కమిటీ నియమించింది. ఈ నేపథ్యంలో తాంత్రిక పూజలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు వార్తలు వెలుగుచూశాయి. దానిపై స్పందించిన రాధాకృష్ణ శర్మ... క్షద్ర పూజలు చేశానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top