గవర్నర్‌ను కలుస్తా: రాజనర్సింహ
జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును అంగీకరించేది లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
	హైదరాబాద్: జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును అంగీకరించేది లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రాజెక్టుల అంచనాల పెంపు ఎవరి ప్రయోజనాల కోసమంటూ ఆయన ప్రశ్నించారు. అంచనాల పెంపు వల్ల తెలంగాణ ప్రజలపై పరోక్ష భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
	
	కేబినెట్‌లో చర్చించకుండా పెంపుపై నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని, మళ్లీ రాస్తానని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇదే విషయంపై త్వరలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలుస్తానని చెప్పారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
