తన వల్ల నన్నపనేని రాజకుమారి ఇబ్బంది పడితే పశ్చాతాపం చెందుతున్నానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు.
హైదరాబాద్ : తన వల్ల నన్నపనేని రాజకుమారి ఇబ్బంది పడితే పశ్చాతాపం చెందుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనతో నన్నపనేని కిందపడిపోయారని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కాగా శాసనమండలి మీడియా పాయింట్ వద్ద జరిగిన తోపులాటలో నన్నపనేని కిందపడిపోయిన విషయం తెలిసిందే.
కాగా స్వామిగౌడ్పై శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి ఫిర్యాదు చేసినట్లు నన్నపనేని రాజకుమారి తెలిపారు. మండలి ఆవరణలోనే రక్షణ లేదని...ఇక తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. స్వామిగౌడ్పై చర్య తీసుకోవాలని ఛైర్మన్ను కోరినట్లు చెప్పారు.