చదువు అలంకారంగా కాదు ... | I am satisfied with cameroon tour, says Kodela Siva Prasada rao | Sakshi
Sakshi News home page

చదువు అలంకారంగా కాదు ...

Oct 10 2014 4:48 PM | Updated on Aug 18 2018 9:30 PM

చదువు అలంకారంగా కాదు ... - Sakshi

చదువు అలంకారంగా కాదు ...

యువతను రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు.

హైదరాబాద్: యువతను రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. పిల్లలకు చదువు అలంకారం కాకుండా... వారికి అన్నం పెట్టే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...   ఇటీవల కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశానికి దాదాపు 53 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. ఈ సమావేశంలో తాను యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే అంశంపై ప్రసంగించినట్లు కోడెల తెలిపారు. తన ఈ పర్యటన సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాను నిబంధనలకు అనుగుణంగానే విదేశీ పర్యటన చేసినట్లు
కోడెల వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement