breaking news
commonwealth speakers conference
-
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటింది: ప్రధాని మోదీ
ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్ దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. -
‘సంవిధాన్ సదన్’లో స్పీకర్ల సందడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన 28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. జనవరి 15న ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తర్వాత సభికులనుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో సమకాలీన పార్లమెంటరీ సవాళ్లు, పరిష్కారాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. ప్రధానంగా ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టం చేయడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల కీలక పాత్రపై చర్చించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ పనితీరులో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా పార్లమెంటరీ ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు.. 1. ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?2. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?3. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?4. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా? -
చదువు అలంకారంగా కాదు ...
హైదరాబాద్: యువతను రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. పిల్లలకు చదువు అలంకారం కాకుండా... వారికి అన్నం పెట్టే విధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి దాదాపు 53 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. ఈ సమావేశంలో తాను యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే అంశంపై ప్రసంగించినట్లు కోడెల తెలిపారు. తన ఈ పర్యటన సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాను నిబంధనలకు అనుగుణంగానే విదేశీ పర్యటన చేసినట్లు కోడెల వివరించారు.


