
'రాజ్ భవన్ లో ఖాళీగా కూర్చోను'
రాజ్ భవన్ లోఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
హైదరాబాద్: రాజ్ భవన్ లోఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎంట్రీ ట్యాక్స్'పై ఏపీ కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య అంతర్గత సంభాషణ చోటు చేసుకుంది.
రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు తనకు తెలుసునని కాంగ్రెస్ నేతలతో గవర్నర్ అన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడానని గుర్తు చేశారు. తానేం చేశానో ప్రజలకు తెలుసునని, అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తానని అన్నారు. ఏం చేసినా ఆలోచించి నిజాయితీ పనిచేశానని చెప్పారు. ఒకరితో చెప్పించుకునే రానీవ్వనని గవర్నర్ పేర్కొన్నారు.