నేను దొంగను కాదు... వ్యాపారిని | I am not a thief, I am a business person | Sakshi
Sakshi News home page

నేను దొంగను కాదు... వ్యాపారిని

Jun 3 2015 11:36 PM | Updated on Sep 3 2017 3:10 AM

చెన్యీ ఫియాన్‌ను కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకువెళుతున్న పోలీసులు

చెన్యీ ఫియాన్‌ను కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకువెళుతున్న పోలీసులు

‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ ఏ బిజినెస్ పర్సన్..(నేను దొంగను కాదు... వ్యాపారిని)’’ అంటూ విలేకరుల ముందు చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ చెన్యీ ఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు.

మదనపల్లె రూరల్/పూతలపట్టు: ‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ ఏ బిజినెస్ పర్సన్..(నేను దొంగను కాదు... వ్యాపారిని)’’ అంటూ విలేకరుల ముందు చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ చెన్యీ ఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వడ్డీకి తెచ్చిన డబ్బుతో వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు.

తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని విలపించాడు. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడైన చెన్యీఫియాన్‌ను పోలీసులు బుధవారం మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. 14రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. మరో నిందితుడు సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరు పరిచగా... అతడికీ 14 రోజుల పాటు రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement