అనంత రైతు పాత్రలో నటిస్తా..

i am acting in Anantapur farmer role : suman - Sakshi

ప్రముఖ సినీ నటుడు సుమన్‌

అనంత ఆణిముత్యాలు పురస్కారాలు అందుకున్న విశిష్ట వ్యక్తులు

పెనుకొండ/అనంతపురం కల్చరల్‌: జిల్లా రైతుల స్థితిగతులు, నైపుణ్యం తెలుసుకున్నాక అనంత రైతు పాత్రలో నటించాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సినీ నటుడు సుమన్‌ పేర్కొన్నారు. సాహితీ గగన్‌ మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి నేతృత్వంలో శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడారు.

 సినిమాల్లో అనంతపురం జిల్లాను ఫ్యాక్షన్‌ ప్రాంతంగా చిత్రీకరించడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  సినిమా రంగం తరుఫున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు. అనంతపురంలో పుట్టి దేశవిదేశాల్లో కీర్తి గాంచిన ఇంతమంది విశిష్ట వ్యక్తులను సత్కరించడం అభినందనీయమన్నారు. తాను ఉత్తమ రైతు శివశంకరరెడ్డి ఇంటిలో అతిథ్యం తీసుకున్న సమయంలో వారి మాటలు విన్న తర్వాత వ్యవసాయంపై ప్రేమ, గౌరవం పెరిగిందన్నారు.

సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వాడిననే విషయం చాలా తక్కువ మందికి తెలుసునన్నారు. అంతకు ముందు సాహితీ గగన్‌ మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో అనంత ఆణిముత్యాల విశిష్టతను మాజీ డీజీపీ రొద్దం ప్రభాకరరావు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి నరసింగప్ప, ప్రముఖ పారిశ్రామిక వేత్త మేడా నరసింహులు తెలియజేసారు.  సమావేశంలో సుంకు  బాలచంద్ర వ్యాఖ్యానం ఆకట్టుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top