
350 చిత్రాల్లో నటించా
తాను ఇప్పటివరకు 350 చిత్రాల్లో నటించానని.. దేవుళ్ల పాత్రలు నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సుమన్ అన్నారు.
నారాయణపురం (ఉంగుటూరు) : తాను ఇప్పటివరకు 350 చిత్రాల్లో నటించానని.. దేవుళ్ల పాత్రలు నటించేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు సుమన్ అన్నారు. నారాయణపురంలో శనివారం లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటి వరకు ఎన్ని చిత్రాల్లో నటించారు
350 చిత్రాల్లో నటించాను. తెలుగు, తమిళం,
హిందీ, కన్నడ భాషల్లో నటించా.
తెలుగులో ఎన్ని చిత్రాలు నటించారు
99 చిత్రాలు నటించాను. వందో చిత్రం కోసం ఎదురుచూస్తున్నా.
ప్రస్తుతం ఏ చిత్రాల్లో నటిస్తున్నారు.
హిందీలో అక్షయకుమార్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో
ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నా
మీకు ఎవరు స్ఫూర్తి
అభిమానులే నాకు స్ఫూర్తి వారి ఆశీస్సులే దీవెనలు.
ఎవరి స్ఫూర్తితో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రధాన మోడీ ‘స్వచ్ఛ భారత్’ పిలుపు నాకెంతగానో స్ఫూర్తినిచ్చింది.