భార్యపై అనుమానంతో..

Husband Murders Wife On Suspicion In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన టి.నరసాపురం మండలం మెట్టగూడెంలో జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా మెట్టగూడెం ఉలిక్కిపడింది. వివరాలిలా ఉన్నాయి.. మెట్టగూడానికి చెందిన కోడూరి జీవనజ్యోతి (27)ను ఆమె భర్త మణికంఠ స్వామి టెలిఫోన్‌ ఛానల్‌ రాడ్డుతో తలపై కొట్టి హతమార్చాడు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జీవనజ్యోతి తలపై రాడ్డుతో కొట్టి హతమార్చిన మణికంఠస్వామి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు రాత్రి 12.30 గంటల ప్రాంతంలో వెళ్లి లొంగిపోయాడు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ నుంచి రాత్రి 2 గంటల ప్రాంతంలో మృతురాలి సోదరుడు నంద్యాల వరప్రసాద్‌కు ఫోన్‌ వచ్చింది. మీ బావ మీ అక్కను తలపై కొట్టాడు ఆమె పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్పమని పోలీసులు వరప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో వరప్రసాద్‌ చెల్లెలు నివాసం ఉండే ఇంటికి వెళ్లి చూడగా, జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది.

వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జ్యోతి మృతిచెందిందని నిర్ధారించారు. మండలంలోని మధ్యాహ్నపువారిగూడెం గ్రామానికి చెందిన కోడూరి మణికంఠస్వామి టి.నరసాపురం మండలం మెట్టగూడెంకు చెందిన నంద్యాల వెంకటేశ్వరరావు కుమార్తె జీవనజ్యోతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవా రని, తన చెల్లెల్ని బావ మణికంఠ స్వామి కొట్టి చంపాడని మృతురాలి సోదరుడు వరప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో టి.నరసాపురం హెచ్‌సీ పి.మహేశ్వరరావు కేసు నమోదుచేశారు. చింతలపూడి సీఐ పి.రాజేష్‌ ఘటనా స్థలాన్ని పరి శీలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామాలో డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌కే షకీలున్నీసా పాల్గొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top