ఎట్టకేలకు దిగొచ్చిన భర్త | Husband harassments On Wife Case Files East Godavari | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు దిగొచ్చిన భర్త

Nov 23 2018 7:41 AM | Updated on Nov 23 2018 7:41 AM

Husband harassments On Wife Case Files East Godavari - Sakshi

బాధితురాలి నుంచి వివరాలను నమోదు చేసుకుంటున్న షీ టీమ్‌ బృందం

తూర్పుగోదావరి , కడియం: స్థానిక బండారు వారి వీధికి చెందిన అనసూరి ప్రవీణ్‌కుమార్‌ తనకు అన్యాయం చేస్తున్నాడని, అతడి ఇంటిముందే భార్య శ్రీపద్మ చేపట్టిన దీక్షకు భర్త దిగొచ్చాడు. శ్రీపద్మ దీక్ష విషయం ఫోన్‌ ద్వారా సమాచారం అందుకున్న అతడు బుధవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. దీంతో స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సురేష్, షీ టీమ్‌ సభ్యులు ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రవీణ్‌కుమార్‌ ఆచూకీ తెలిసిన నేపథ్యంలో కాకినాడ రూరల్‌ మండలం ఇంద్రపాలెంలో కేసు నమోదై ఉన్నందున వీరిద్దరినీ అక్కడికి పంపించారు. కేసు పెట్టినా స్పందించని పోలీసులు మీడియా రంగప్రవేశంతో కదిలారని గార్డ్స్‌ఫర్‌ ఆర్‌టీఐ అధ్యక్షులు రాయవరపు సత్యభామ, ముత్యాల పోసికుమార్‌ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement