పిడుగురాళ్లలో దొంగల బీభత్సం | hundi robbery in ayyappa temple at guntur district | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో దొంగల బీభత్సం

Jan 16 2016 11:57 AM | Updated on Sep 3 2017 3:45 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది.

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న ఆరు చిన్న హుండీలు, ఒక పెద్ద హుండీని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అపహరించుపోయారు. శనివారం ఉదయం గమనించిన నిర్వాహకులు చుట్టుపక్కల వెదకగా పక్కనే ఉన్న పత్తి చేనులో పగుల గొట్టిన హుండీలు కనిపించాయి. ఎంత సొత్తు పోయిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement