సీతమ్మధారలో రూ. 9 లక్షల చోరీ | huge robbery in seetammadhara | Sakshi
Sakshi News home page

సీతమ్మధారలో రూ. 9 లక్షల చోరీ

Jun 30 2016 3:58 PM | Updated on Sep 4 2017 3:49 AM

విశాఖపట్నం సీతమ్మధారలో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది.

విశాఖ: విశాఖపట్నం సీతమ్మధారలో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. నగరంలోని సీతమ్మధారలోని ఎంవీపీ కాలనీ ఏఎస్‌రాజా కళాశాల సమీపంలో ఓ వ్యక్తి నుంచి రూ. 9 లక్షలను ఆగంతకులు లాక్కెళ్లారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ద్వారకనగర్‌కు చెందిన ఒక వ్యక్తి బ్యాంకులో రూ. 9 లక్షలు  డ్రాచేసి తెమ్మని కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు చెక్కు ఇచ్చి పంపాడు.
 
డ్రైవర్ కారులో వెళ్లి డబ్బు తీసుకుని వచ్చాడు. ఇంటివద్ద కారును ఆపి డోర్ తీస్తుండగా వెనుక వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కారులోని నగదు సంచిని లాక్కొని ద్విచక్రవాహనంపై ఉడాయించారు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో నివ్వెరపోయిన డ్రైవర్పో లీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement