భారీగా గంజాయి స్వాధీనం | huge Cannabis seized in east godavari district | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి స్వాధీనం

Dec 4 2015 4:17 PM | Updated on Sep 3 2017 1:29 PM

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన రాజవొమ్మంగి మండలం జమ్మిచావిడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. జడ్డంగి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువు సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement