సీఎం రిలీఫ్ ఫండ్కు రాంచరణ్ 10లక్షల విరాళం | Hudud cyclone: Hero ramcharan to donate Rs.10 lakhs cm relief fund | Sakshi
Sakshi News home page

సీఎం రిలీఫ్ ఫండ్కు రాంచరణ్ 10లక్షల విరాళం

Oct 14 2014 12:12 PM | Updated on Sep 2 2017 2:50 PM

సీఎం రిలీఫ్ ఫండ్కు రాంచరణ్ 10లక్షల విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్కు రాంచరణ్ 10లక్షల విరాళం

హుదూద్ తుఫానుపై హీరో రాంచరణ్ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తుఫానుపై మాటలు రావటం లేదన్నారు.

హైదరాబాద్ : హుదూద్ తుఫానుపై హీరో రాంచరణ్ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీవీలో తుఫాను బీభత్సాన్ని చూసిన తనకు నోటీ నుంచి మాటలు కూడా రావటం లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు రాంచరణ్ రూ.10 లక్షల  విరాళం ప్రకటించారు. అలాగే విశాఖలోని రామకృష్ణ మిషన్కు మరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

టెక్నాలజీ, ముందుచూపు, మీడియా విస్తృత ప్రచారంతో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. అలాగే తుఫాను సహాయక చర్యల్లో తమ అభిమానులు పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు.  అలాగే బాధితులకు ఆహారంతో పాటు మంచినీరు అందించనున్నట్లు రాంచరణ్ తెలిపారు. తుఫానుపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తత చేసినందుకు ఆయన మీడియాను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement