వివాహిత అనుమానాస్పద మృతి | house wife suspious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 8 2015 9:41 PM | Updated on Sep 2 2017 10:31 PM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

వి.కోట: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జౌనిపల్లె గ్రామానికి చెందిన సరస్వతి(26)కు తీవ్ర అస్వస్థతకుగురి కాగా భర్త, అత్త కలసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సరస్వతి ఆదివారం సాయంత్రం మృతి చెందింది.

 

మృతురాలికి విష ప్రయోగంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement