ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం | Homosex caused one life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం

Jan 21 2015 6:28 PM | Updated on Sep 2 2017 8:02 PM

ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం

ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం

విజయనగరం జిల్లా బొబ్బిలిలో నాయుడు కాలనీలోని సంస్థానం ఉన్నత పాఠశాలలో రెండు రోజుల కిందట జరిగిన జూనియర్ అసిస్టెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో నాయుడు కాలనీలోని సంస్థానం ఉన్నత పాఠశాలలో రెండు రోజుల కిందట జరిగిన జూనియర్ అసిస్టెంట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వలింగ సంపర్కమే ఈ హత్యకు కారణమని వెల్లడైండి. హంతకుడు, బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న నిరుద్యోగి పారధి భరత్‌కుమార్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

వివరాల్లోకెళ్తే.. నిరుద్యోగి అయిన భరత్‌కు పాఠశాలలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఆర్ సాంబశివరావుతో పరిచయం ఏర్పడింది. డబ్బులకు ఇబ్బందిగా ఉందని సాంబశివరావుకు చెప్పగా.. అతను తన కోరిక తీర్చితే డబ్బులు ఇస్తానని అన్నాడు. భరత్ అందుకు ఒప్పుకున్నాడు. గత పదిరోజులుగా భరత్ డబ్బులు ఇవ్వమని ఎంత బతిలాడిన ఇవ్వకపోగా, సాంబశివ శారీరకంగా హింసించాడు. భరత్‌కుమార్ జనవరి 19 రాత్రి అతని ఇంటికి వెళ్లి ఇదే విషయమై గొడవ పెట్టుకున్నాడు. భరత్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి సాంబశివారావును హత్య చేశాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి హత్య చేసిన ప్రాంతంలో మిరప పొడిని చల్లాడు. హత్య అనంతరం అతని కాల్‌లీస్ట్‌పై దృష్టి పెట్టిన పోలీసులు చాకచక్యంగా ఈ కేసును ఛేదించారు.

Advertisement

పోల్

Advertisement