సెలవు రోజూ మద్యం డెలివరీ | hollday alcohal delivari | Sakshi
Sakshi News home page

సెలవు రోజూ మద్యం డెలివరీ

May 26 2014 3:41 AM | Updated on Sep 2 2017 7:50 AM

సెలవు రోజూ మద్యం డెలివరీ

సెలవు రోజూ మద్యం డెలివరీ

ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపో నుంచి సెలవు రోజైన ఆదివారం కూడా మద్యం డెలివరీ కొనసాగింది.

25 రోజుల్లో రూ.55 కోట్ల మద్యం బట్వాడా
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్, ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపో నుంచి సెలవు రోజైన ఆదివారం కూడా మద్యం డెలివరీ కొనసాగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు 55 కోట్ల రూపాయల విలువైన మందును అధికారులు డెలివరీ చేశారు. రోజుకు రూ.మూడు నుంచి రూ. ఐదు కోట్లు వరకు మద్యం డెలివిరీ అవుతోంది. ఎన్నికల హడావుడి ముగిసినప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 24 నుంచి జూన్ ఆరో తేదీ వరకు ఐఎంఎల్ డిపోలు మూచేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు పెరిగాయి.

అయితే ప్రస్తుతానికి మూసివేతకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాక పోవటంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న నేపథ్యంలో సెలవు రోజైన ఆదివారం కూడా మద్యాన్ని డెలివరీ చేశారు. డిమాండ్ ఉన్న మద్యం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని వైన్ షాపులకు సంబంధిత యజమానుల ఇండెంట్‌పై కావల్సిన మద్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement