వైఎస్‌ జగన్‌ను కలిసిన హిందూ గ్రూప్‌ ఛైర్మన్‌

The Hindu Group Chairman Ram Meets CM YS Jagan - Sakshi

 మర్యాదపూర్వకంగా కలిసిన ద హిందూ గ్రూపు ఛైర్మన్‌ రామ్‌

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ‘ద హిందూ’ గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.రామ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఆయన నివాసానికి వచ్చిన రామ్‌.. సీఎంగా ఎన్నికయినందుకు వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అమ్మఒడి, రైతు భరోసా వంటి వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికను తెలిపారు. అమ్మఒడి పథకం తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్‌.రామ్‌ ఈ సందర్భంగా సీఎంతో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని రామ్‌ గుర్తుచేసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌కు జ్ఞాపికను అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top