రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన టైటానియం ఖనిజం కేటాయింపుల కేసులో ఇంప్లీడ్ కావాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది
కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు
Apr 28 2014 5:12 PM | Updated on Aug 31 2018 8:24 PM
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన టైటానియం ఖనిజం కేటాయింపుల కేసులో ఇంప్లీడ్ కావాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా వార్తల ద్వారానే మాకు రెడ్‌కార్నర్ నోటీసు విషయం తెలిసిందని, అయితే అమెరికా కోర్టు నుంచి ఇప్పటి వరకు మాకు నోటీసులు అందలేదని కేవీపీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.
అయితే రెడ్‌కార్నర్ నోటీసులు తమకు అందాయని, వారెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదని సీఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేవీపీపై అమెరికా కోర్టు జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.
Advertisement


