-
నీరవ్ మోదీపై రెడ్‌కార్నర్ నోటీసులు
న్యూఢిల్లీ: దాదాపు 13 వేల కోట్ల రూపాయల పీఎన్బీ కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని సోదరుడు నిశాల్ మోదీ, ఆ కంపెనీ ఉద్యోగి సుభాష్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. రెడ్‌కార్నర్ నోటీసుల జారీ నేపథ్యంలో అంతర్జాతీయ నిఘా విభాగాల కళ్లుగప్పి వివిధ దేశాల మధ్య మోదీ రాకపోకలు సాగించడం ఇకపై కష్టం. అతని అరెస్టుకు మార్గం సుగమమవుతుంది. ఒకవేళ నీరవ్ కనిపిస్తే తక్షణ అరెస్టు చేయడం లేదా అదుపులోకి తీసుకోవాలని నోటీసుల్లో 192 సభ్య దేశాల్ని ఇంటర్‌పోల్ కోరింది. ఒకసారి అరెస్టయితే అతన్ని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మే 2008– మే 2017 మధ్య కాలంలో నీరవ్ మోదీకి జారీ చేసిన ఐదు పాస్‌పోర్టుల వివరాల్ని ఆర్‌సీఎన్‌లో పేర్కొన్నారు. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీటుతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన అరెస్టు వారెంట్ ఆధారంగా రెడ్ కార్నర్ నోటీసు(ఆర్సీఎన్)ను ఇంటర్‌పోల్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగుచూడక ముందే.. నీరవ్ మోదీ, అతని భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్, మామ చోక్సీ విదేశాలకు పరారయ్యారు. అవినీతి, మోసం ఆరోపణలపై మోదీ, చోక్సీలతో పాటు నిశాల్, పరబ్‌ల పేర్లను సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్చింది. -
కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు సంబంధించిన టైటానియం ఖనిజం కేటాయింపుల కేసులో ఇంప్లీడ్ కావాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా వార్తల ద్వారానే మాకు రెడ్‌కార్నర్ నోటీసు విషయం తెలిసిందని, అయితే అమెరికా కోర్టు నుంచి ఇప్పటి వరకు మాకు నోటీసులు అందలేదని కేవీపీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. అయితే రెడ్‌కార్నర్ నోటీసులు తమకు అందాయని, వారెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదని సీఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేవీపీపై అమెరికా కోర్టు జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement