ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యమిత్రలకు హైకోర్టులో చుక్కెదురైంది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యమిత్రలకు హైకోర్టులో చుక్కెదురైంది. వైద్యమిత్రల నియామకానికి ప్రభుత్వం పలు కొత్త అర్హతలను తీసుకొచ్చిందని, దీని వల్ల తమకు నష్టం కలుగుతుందంటూ అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న వైద్యమిత్రలు పెద్ద సంఖ్యలో దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని తేల్చి చెప్పింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం తీర్పు వెలువరించారు. తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. రెండు నెలల పాటు వైద్య మిత్రలను యథాతథంగా కొనసాగించాలని ఏపీ సర్కార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ లోపు న్యాయం కోసం సంబంధిత ఫోరాన్ని ఆశ్రయించవచ్చునని వైద్యమిత్రలకు స్పష్టం చేశారు.