సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు | High Court an easing of Stay on suman rathod | Sakshi
Sakshi News home page

సుమన్ రాథోడ్‌కు చుక్కెదురు

Dec 25 2013 1:02 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ వివాదంపై హైకోర్టు ఇచ్చిన స్టేను మంగళవారం ఎత్తివేసింది.

ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ ఎస్టీ వివాదంపై హైకోర్టు ఇచ్చిన స్టేను మంగళవారం ఎత్తివేసింది. ఎస్టీ కాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై సుమన్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయం విధితమే. 2009 సాధారణ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ అప్పటి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఉయికే సంజీ వ్‌తోపాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ నదీం విచారణ చేపట్టి ఆమె మహారాష్ట్రలోని బీసీ కులానికి చెందిన మహిళ అని 2009 అక్టోబర్‌లో తీర్పునిచ్చారు.

కలెక్టర్ తీర్పును సవాలు చేస్తూ సుమన్‌రాథోడ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇదే సమయంలో 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజ్మిరా హరినాయక్  హైకోర్టులో కేసు వేయడంతో 2010 డిసెంబర్‌లో సుమన్‌రాథోడ్ ఎస్టీ కాదంటూ తీర్పు వెలువడింది. పైకోర్టుకు అప్పీ లు చేసుకునే అవకాశం కల్పించడంతో అదే నెలలో సుమన్‌రాథోడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 2012 సెప్టెం బర్‌లో కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విస్తృత ధర్మాసనం త్రిసభ్య కమిటీకి అప్పగించింది. అయితే మంగళవారం 2009 అక్టోబర్‌లో అప్పటి కలెక్టర్ అహ్మద్ నదీం ఇచ్చిన తీర్పుపై విధించిన స్టేను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టులో కేసు యథావిధిగా ఉంది.
 అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకం ఉంది..
 - సుమన్‌రాథోడ్
 మంగళవారం సాయంత్రం సుమన్‌రాథోడ్ తన నివాసం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తనపై ఉన్న ఎస్టీ కాదనే వివాదంపై కలెక్టర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్టేను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement