హైటెక్ మోసం | hi-tech teaching | Sakshi
Sakshi News home page

హైటెక్ మోసం

Aug 31 2013 2:57 AM | Updated on Sep 1 2017 10:17 PM

చట్టాలలో లోపాలను ఆసరాగా చేసుకుని కోర్టును, జిల్లా ఎస్పీని మోసం చేసి భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించిన వైరాకు చెందిన ఆదూరి సురేష్ కుమార్, అతని తల్లి బేబి అమ్మాళ్‌ను అరెస్టు చేశామని వైరా సీఐ మోహన్‌రాజా తెలిపారు.

 వైరా, న్యూస్‌లైన్ : చట్టాలలో లోపాలను ఆసరాగా చేసుకుని కోర్టును, జిల్లా ఎస్పీని మోసం చేసి భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించిన వైరాకు చెందిన ఆదూరి సురేష్ కుమార్, అతని తల్లి బేబి అమ్మాళ్‌ను అరెస్టు చేశామని వైరా సీఐ మోహన్‌రాజా తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో  ఆయన వివరా లు వెల్లడించారు. వైరాకు చెందిన రాయల నారాయణ స్థానిక కూరగాయల మార్కెట్‌లో ఉన్న 330 గజాల భూమిని తన కుమారులు శంకర్‌రావుకు, అనంతరాములుకు పంచి ఇచ్చారని తెలిపారు. వారసత్వంగా రాయల అనంతరాములు పొందిన 220 గజాల భూమిని వైరాకు చెందిన ఆదూరి సురేష్ తప్పుడు పత్రాలతో తల్లి పేరుపై రిజిష్ట్రేషన్ చేయించి, అనంతరం తన పేరుపై బహుమతి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వివరించారు. అంతేకాకుండా తన స్థలాన్ని ఆక్రమించారని, వైరాకు చెందిన నెలవల్లి రామారావు, రాయల శంకర్‌రావులపై సత్తుపల్లి కోర్టులో తప్పుడు కేసు వేశారని, దాంతో కేసు విచారించిన కోర్టు ఆ స్థలం సురేష్‌కు చెందినదిగా డీక్రి ఇచ్చిందని వివరించారు. ఇటీవల ఆ స్థలంలో సురేష్ ఇంటి నిర్మాణం చేపట్టగా, అనంతరాములు అడ్డుకున్నాడని, దీంతో సురేష్ అనంతరాములుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ విచారణకు డీఎస్పీని ఆదేశించారని చెప్పారు. డీఎస్పీ సాయిశ్రీ విచారణలో సురేష్ అక్రమాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు.
 
 ఎస్సైపై చర్యలకు నివేదిక..
 రెండేళ్ల క్రితం స్థల ఆక్రమణపై సురేష్ ఫిర్యాదుమేరకు పోలీసులు కోర్టు డిక్రీ ఆధారంగా అనంతరాములుపై తప్పుడు కేసు చేశారని సీఐ మోహన్‌రాజా తెలిపారు. ఈ వ్యవహారాన్ని అప్పటి ఎస్సై పూర్తిగావిచారిస్తే త ప్పుడు ధ్రువపత్రాల బాగోతం బయటపడేదని అభిప్రాయపడ్డారు. రా య ల అనంతరాములు, అతని తమ్ముడు శంకర్‌రావులపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఎస్సై రవిపై కూడా చర్యలకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని స్పష్టం చేశారు. కోర్టు నుంచి ఇచ్చిన డిక్రీని రద్దు చేయాలని, జడ్డీకి జరిగిన సంఘటనను వివరిస్తూ లేఖ పంపిస్తామని మోహన్‌రాజా తెలిపారు. ఇలాంటి కేసు తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. సమావేశంలో వైరా ఎస్సై తుమ్మా గోపి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement