శరన్న నవరాత్రులు ప్రారంభంతో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది.
విజయవాడ: శరన్న నవరాత్రులు ప్రారంభంతో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం శుక్రవారం భక్తులతో పోటెత్తింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. సామాన్య భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అయితే వీఐపీ దర్శనం పేరుతో అమ్మవారి అంతరాలయంలోకి భక్తుల ప్రవేశాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.