భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్ | heavy rains lashed guntur district | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్

Sep 18 2014 3:19 PM | Updated on Aug 24 2018 2:36 PM

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్ - Sakshi

భారీ వర్షాలకు గుంటూరు జిల్లా గుభేల్

భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు.

గుంటూరు: భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది.

నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్‌ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తాటికొండలో కొండవీటివాగు ఉగ్రరూపం దాల్చింది. కొండవీటివాగులో ఓ యువతి గల్లతైంది. ప్రత్తిపాడులో చెరువు పొంగి పక్కనేవున్న ఎస్సీకాలనీలోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement